మాకూ అవకాశం ఇవ్వండి | Give me chance says Anushka | Sakshi
Sakshi News home page

మాకూ అవకాశం ఇవ్వండి

Jul 25 2015 2:17 AM | Updated on Sep 3 2017 6:06 AM

మాకూ అవకాశం ఇవ్వండి

మాకూ అవకాశం ఇవ్వండి

మా గురించి కాస్త ఆలోచించండి అంటున్నారు నటి అనుష్క. మనకున్న అతి కొద్ది మంది నటనా సత్తా ఉన్న నటీమణుల్లో

 మా గురించి కాస్త ఆలోచించండి అంటున్నారు నటి అనుష్క. మనకున్న అతి కొద్ది మంది నటనా సత్తా ఉన్న నటీమణుల్లో అనుష్క ఒకరని నొక్కివ క్కాణించవచ్చు. ఆదిలో ఆట బొమ్మగా కొన్ని చిత్రాల్లో కనిపించినా, ఆ తరువాత తనలోని ప్రతిభను వెలికి తీసే పాత్రల్లో దుమ్మురేపారు. ఉదాహరణకు ఒక్క అరుంధతి చాలు నటిగా అనుష్క సత్తా ఏమిటో చెప్పడానికి. త్వరలో రుద్రమదేవిగా వెండితెరపై విజృంభించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో పలు సాహసాలు చేసిన అనుష్క గుర్రపు స్వారీలు, కత్తిసాములు చేశారు. ఆమె వీరోచిత దృశ్యాలు త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం.
 
 అలాగే ద్విభాషా చిత్రం ఇంజిఇడుప్పళగి (తెలుగులో సైజ్ జీరో) చిత్రంలోని పాత్ర కోసం వంద కిలోల బరువు పెంచుకుని నటిస్తున్న నటి అనుష్క. అలాంటి నటి కొంచెం మాగురించి కూడా ఆలోచించండి అంటూ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక ఆమె కళాతృష్ణ ఉందని భావించాలి. లేక కొన్ని పాత్రలు నిరాశ పరచి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆమె అభ్యర్థనలో అర్థం ఉంది. తమిళ,తెలుగు చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువేనన్నది అంగీకరించి తీరాల్సిందే.
 
  ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తుంటాయి. మలయాళంలో అలా కాదు. అక్కడ కథానాయకులతోపాటు కథానాయికీలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకు ముందు నటి విజయశాంతి హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అలా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ, యాక్షన్ కథా చిత్రాల్లోనూ నటించడానికి తనలాంటి వారు సిద్ధంగా ఉన్నారు. మా గురించి కాస్త ఆలోచించండి అంటూ అనుష్క దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement