మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు | Friend arrested in Woman's murder case | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు

Apr 2 2017 2:47 AM | Updated on Sep 5 2017 7:41 AM

మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు

మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు

అదృశ్యమైన ఓ మహిళను ఆమె స్నేహితురాలు కిరోసిన్‌ పోసి సజీవదహనం చేసిన సంఘటన తిరువట్టార్‌ సమీపంలో జరిగింది.

అన్నానగర్‌ : అదృశ్యమైన ఓ మహిళను ఆమె స్నేహితురాలు కిరోసిన్‌ పోసి సజీవదహనం చేసిన సంఘటన తిరువట్టార్‌ సమీపంలో జరిగింది. తిరువట్టార్‌ సమీపంలో సారూర్‌ ప్రాంతానికి చెందిన కూలీ ఇన్సెంట్‌ (42). ఇతని భార్య శశికళ (36). వీరికి ఇద్దరు కుమారులు. 25న ఉదయం శశికళ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇన్సెంట్‌ బంధువుల ఇళ్లు సహా పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు.

 దీంతో అతను తిరువట్టార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శశికళకు నాగర్‌కోవిల్‌కు చెందిన కళతో పరిచయమై ఉన్నట్లు తెలియడంతో ఆమెను పోలీసులు విచారణ చేశారు. విచారణలో నెల్లై జిల్లా దిసైయన్‌విలై శ్మశానంలో శశికళను సజీవదహనం చేశానని ఆమె ఒప్పుకుంది. అనంతరం శశికళ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన చోటును పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కళను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement