అమ్మాయి కోసం విద్యార్థుల ఫైటింగ్..! | For Girl to Students Fighting ..! | Sakshi
Sakshi News home page

అమ్మాయి కోసం విద్యార్థుల ఫైటింగ్..!

Jun 11 2016 2:46 AM | Updated on Mar 21 2019 9:07 PM

మండలంలోని అంగళ్లులో శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పడ్డారు.

కురబలకోట : మండలంలోని అంగళ్లులో శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు... అంగళ్లులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిని మరో విద్యార్థి ఇష్టపడ్డాడు. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె అంగళ్లు వద్ద మరొకరి కారు ఎక్కడం చూసిన అతను స్నేహితులతో కలిసి అటకాయించాడు. దీంతో పరస్పరం గొడ వ పడ్డారు.

ఒకరికొకరు కొట్టుకోవడంతో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. కొంత సేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వారించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని విచారణలో తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement