ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | football competitions started in ongole | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Oct 9 2016 9:05 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం - Sakshi

ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

ఐఎల్‌టీడీ కంపెనీ క్రీడా మైదానంలో శనివారం లీగ్‌ కం సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభించారు.

చీరాల : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఐఎల్‌టీడీ కంపెనీ క్రీడా మైదానంలో శనివారం లీగ్‌ కం సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభించారు. జిల్లా ఫుట్‌బాల్‌ కోచ్‌ పాల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఒంగోలు, చీరాల, కందుకూరు ప్రాంతాల్లో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

10వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామని, ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లు ఒంగోల్లో సూపర్‌ లీగ్‌ పోటీల్లో పాల్గొం టాయని తెలిపారు. సూపర్‌ లీగ్‌లో ఉత్తమ ఆటతీరు కనబరిచిన క్రీడాకారులను సీనియర్‌ నేషనల్స్‌కు రాష్ట్రం తరఫున ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కావూరి విన్సెంట్, జిల్లా సెక్రటరీ కావూరి ప్రసన్న, వైస్‌ ప్రెసిడెంట్‌ నూతలపాటి బాలశౌరి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement