శ్రీ చైతన్య స్కూల్‌లో అగ్నిప్రమాదం | fire accident in sri chaitanya school | Sakshi
Sakshi News home page

శ్రీ చైతన్య స్కూల్‌లో అగ్నిప్రమాదం

Mar 24 2017 12:36 PM | Updated on Sep 5 2018 9:47 PM

అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది.

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపింది. శుక్రవారం పాఠశాల నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు. స్వల్ప అగ్నిప్రమాదం కావడంతో ఉపాధ్యాయులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement