రైతును తొక్కి చంపిన ఏనుగులు | Elephants killed by the farmer centered | Sakshi
Sakshi News home page

రైతును తొక్కి చంపిన ఏనుగులు

Apr 21 2014 2:30 AM | Updated on Oct 1 2018 2:44 PM

ఏనుగుల బారిన పడి ఓ రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు...

 సాక్షి, బెంగళూరు : ఏనుగుల బారిన పడి ఓ రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు... తుమకూరు జిల్లా గళిగేనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి (53) కొన్ని రోజులుగా కొడుకు మహేశ్‌తో పాటు గ్రామశివారులోని పొలం వద్దనే పడుకుంటూ తెల్లవారుజామునే వ్యవసాయ పనులు మొదలు పెట్టేవాడు.
 
ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా సమీప అటవీ ప్రాతం నుంచి వచ్చిన రెండు ఏనుగులు నరసింహమూర్తిపై దాడి చేసి కాళ్లతో తొక్కి చంపేసాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో మహేశ్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement