10 నుంచి ఎన్నికల కోడ్ | election code of conduct from 10th may | Sakshi
Sakshi News home page

10 నుంచి ఎన్నికల కోడ్

May 7 2015 6:08 AM | Updated on Sep 3 2017 1:36 AM

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల పది నుంచి జూన్ 2వ తేదీ వరకు చిక్కబళ్లాపురం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ తెలిపారు.

చిక్కబళ్లాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల పది నుంచి జూన్ 2వ తేదీ వరకు చిక్కబళ్లాపురం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ తెలిపారు. కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయరాదని సూచించారు.

జిల్లాలోని 156 గ్రామ పంచాయతీలకు గాను 152 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని, ఇందుకు సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 22 చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. 23న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. జూన్ 2న పోలింగ్, 5న లెక్కింపు ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement