ఒక కుక్క.. 66 మంది బాధితులు

Dog Bite to 66 members in One Day Tamil Nadu - Sakshi

సేలం: ఒకే కుక్క 66 మందిని కరిచిన సంఘటన శుక్రవారం ఉదయం సేలంలో చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం వద్ద శుక్రవారం పిచ్చికుక్క సంచరిస్తూ ఆ మార్గంలో వెళుతున్న అందరినీ వెంటపడి కరవసాగింది. స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కుక్కను కొట్టి తరిమారు. ఆ కుక్క సమీపంలోని పచ్చపట్టి, నారాయణనగర్, కురింజి నగర్‌ ప్రాంతాల్లో తిరుగుతూ 66 మందిని కరిచింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా, అనేక మంది సేలం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది వారికి చికిత్సలు చేసి రేబిస్‌ టీకాలు వేశారు.  ఎట్టకేలకు పట్ట కోయిల్‌ ప్రాంతంలో సంచరిస్తున్న కుక్కను స్థానికులు కొట్టి చంపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top