అత్యాధునిక ఆస్పత్రి డాక్టర్లు మృతి చెందినట్టు ప్రకటించినప్పటికీ, ఓ వ్యక్తి మళ్లీ లేచికూర్చొనడంతో అంతా ఆశ్చర్యపోయారు.
సాక్షి, ముంబై: అత్యాధునిక ఆస్పత్రి డాక్టర్లు మృతి చెందినట్టు ప్రకటించినప్పటికీ, ఓ వ్యక్తి మళ్లీ లేచికూర్చొనడంతో అంతా ఆశ్చర్యపోయారు. డాక్టర్ల తప్పిదం కారణంగానే ఇలా జరిగిందని తెలిసింది. నిజానికి అతడు సజీవంగానే ఉన్నా మృతి చెందినట్టు డాక్టర్లు పొరబడ్డారు. సదరు రోగి మరణించాడంటూ బుధవారం రాత్రి ప్రకటించిన డాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబై సైన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ధారావిలోని మున్సిపల్ కార్పొరేషన్ నివాస సముదాయంలో ఉండే చంద్రకాంత్ గాంగుర్డే (55)ను గత గురువారం తీవ్ర అస్వస్థత కారణంగా సైన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. కాగా, బుధవారం ఉదయం చంద్రకాంత్ మరణిం చినట్టు ఆస్పత్రి డాక్టర్ ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబీకుల రోదనలతో పరిసరాలు మార్మోగా యి. తదనంతరం ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్‌ను కూడా తొల గించారు. అదే సమయంలో చంద్రకాంత్ శరీరంలో కదలికను గమనించిన అతని కుటుంబీకులు వెంటనే డాక్టర్ల దృష్టి తీసుకెళ్లా, వెంటనే అతడికి మళ్లీ వెంటిలేటర్‌ను అమర్చినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై చంద్రకాంత్ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేసి, సైన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.