రాజకీయ లబ్ధి కోసమే పెద్దనోట్ల రద్దు: సీఎం | demonetization for political benefits | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే పెద్దనోట్ల రద్దు: సీఎం

Jun 24 2017 8:55 AM | Updated on Sep 27 2018 9:08 PM

రాజకీయ లబ్ధి కోసమే పెద్దనోట్ల రద్దు: సీఎం - Sakshi

రాజకీయ లబ్ధి కోసమే పెద్దనోట్ల రద్దు: సీఎం

రాజకీయ స్వలాభం కోసమే దేశంలో పెద్దనోట్ల రద్దు చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, బెంగళూరు : విదేశాల్లో ఉన్న నల్లధనం దేశానికి తెప్పిస్తామని, దొంగనోట్ల చలామణికి అడ్డుకట్ట వేస్తామని, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా అడ్డుకట్టవేస్తామని చెప్పి కేంద్రం ఏకపక్షంగా రాజకీయ స్వలాభం కోసమే దేశంలో పెద్దనోట్ల రద్దు చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  విధానసౌధలో రాష్ట్ర సచివాలయం సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార సంఘాల విచారణ సంకీర్ణం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దు వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. సామాన్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ ప్రభావం సహకార సంఘాలపై కూడా పడిందని అన్నారు.

వెంకయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం : మాటల పైన ఆగ్రహం :
రైతులు ఫ్యాషన్‌ కోసం రైతుల రుణాల మాఫీ చేయాలని డిమాండు చేస్తున్నారని అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్న మాటలకు సీఎం సిద్ధరామయ్య వెంకయ్య నాయుడిపై మండిపడ్డారు. యూపీ ఎన్నికల సమయంలో ప్రధానిన మోదీ రైతుల రుణాల మాఫీ చెఆస్తమని చెప్పడం కూడా ఫ్యాషనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే. శివకుమార్, ఎమ్మెల్యే ఎస్‌.టి.సోమశేఖర్, మునిరత్న, భైరతి సురేష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మంజేగౌడ, ప్రభూత్వ సచివాలయం సహకార సంఘం అధ్యక్షుడు డి.నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement