జాతీయ రాజధానిలో విదేశీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
విదేశీయుల కోసం ‘హెల్ప్‌లైన్’
Feb 7 2014 12:06 AM | Updated on Oct 4 2018 7:01 PM
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో విదేశీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి హత్య, ఆఫ్రికన్ మహిళలపై దాడి వంటి సంఘటనలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశీయుల సంరక్షణార్థం ఒక సీనియర్ అధికారి ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసేలా . +91-8750871111 నంబర్ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కాగా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ పరిధి) ముఖేష్ కుమార్ మీనా ఈ హెల్ప్‌లైన్‌ను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ప్రతి మూడు నెలల కొకసారి ఆయన ఆయా విదేశీయులు నివసించే అసోసియేషన్స్ తోనూ, సంబంధిత కమిషన్ అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు.
Advertisement
Advertisement