సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు | councillors demands to solve problems | Sakshi
Sakshi News home page

సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు

Published Fri, Oct 25 2013 11:26 PM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

వేలూరు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కారం కావడంలేద ని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీ శారు. కార్పొరేషన్ పరిధిలో మూడో మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది.

 వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కారం కావడంలేద ని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీ శారు. కార్పొరేషన్ పరిధిలో మూడో మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ చైర్మన్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూర్యాచారి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. చర్యలు తీసుకుంటామని అంటున్నారు తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
 
 అదే విధంగా పట్టణంలోని వీధుల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు నిర్మించ డం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండకుండా పాలారుకు వెళుతోందని, డ్రైనేజి కాలువల్లో కింది బాగంలో సిమెంట్ వేయకుండా ఉండాలన్నారు. దీనిపై డెప్యూటీ మేయర్ ధర్మలింగం కలుగజేసుకొని వీటిని అమలు చేయడం కుదరదన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మండల కమిటీ అధికారి కరుణాకరన్ కలుగజేసుకొని ప్రతిపాదన చేసి అధికారులకు పంపుతామన్నారు. కౌన్సిలర్ రాజ మాట్లాడుతూ ఓటేరిలోని పార్కును నిర్మించి రెండు సంవత్పరాలు కావస్తున్నా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు.
 
 ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని మండల చైర్మన్ కుమార్ తెలిపారు.  కౌన్సిలర్ శ్రీనివాస గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వీధుల్లో దోమలు చేరకుండా బ్లీచింగ్ చల్లాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం రూ75 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేం దుకు సభ్యులు తీర్మానించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు భరత్‌కుమార్, సూలైరవి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement