హైదరాబాద్: పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 10 స్థానాల్లో మహిళలకు 5, బీసీలకు 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 చొప్పున రిజర్వేషన్ కేటాయించింది. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఖరారు చేసింది.
మేయర్ పదవుల రిజర్వేషన్లు
ఎస్టీ కేటగిరీ
1. కొత్తగూడెం: ఎస్టీ (జనరల్)
ఎస్సీ కేటగిరీ
1. రామగుండం: ఎస్సీ (జనరల్)
బీసీ కేటగిరీ
1. మహబూబ్‌నగర్: బీసీ (మహిళ)
2. మంచిర్యాల: బీసీ (జనరల్)
3. కరీంనగర్ : బీసీ (జనరల్)
అన్ రిజర్వుడ్
1. ఖమ్మం: మహిళ (జనరల్)
2. నిజామాబాద్: మహిళ (జనరల్)
3. జీడబ్ల్యూఎంసీ: అన్ రిజర్వుడ్
4. జీహెచ్ఎంసీ: మహిళ (జనరల్)
5. నల్లగొండ: : మహిళ (జనరల్)


