మహిళ ఏఎస్‌ఐపై కానిస్టేబుల్ దాడి చేసి గాయపరచిన ఘటణ తుమకూరు జిల్లా, కొరటిగెరె పొలిసుస్టేషన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
మకూరు : మహిళ ఏఎస్‌ఐపై కానిస్టేబుల్ దాడి చేసి గాయపరచిన ఘటణ తుమకూరు జిల్లా, కొరటిగెరె పొలిసుస్టేషన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎవరు ఎక్కడ డ్యూటీ చేయాలన్న విషయంలో ఏఎస్‌ఐ మంగళ గౌరమ్మ కానిస్టేబుళ్లకు నిర్దేశం చేసింది. అయితే ‘మేము మాత్రమే రాత్రి డ్యుటీ చేయాలా, మీరు కూడా వచ్చి రాత్రి డ్యూటీ చేయండి’ అంటూ కానిస్టేబుల్ ఎస్. జబీవుల్లా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నాకు పని చెప్పడానికి నీవు ఎవరు? ఎదైన ఉంటె ఉన్నతాధికారులకు చెప్పుకో, ఏమి చేయాలో వారు చెబుతారు, మొదట నీకు చెప్పిన పని చేయి’ అని ఏఎస్‌ఐ సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన జబీవుల్లా దుర్భాషలాడుతూ మంగళగౌరిపై దాడి చేశాడు.
ఘటనలో ఏఎస్‌ఐ చేతికి గాయమై రక్తం రావడంతో సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికి జబిఉల్లా తనకు ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో అతన్ని మరో ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం రాత్రికి రాత్ర ఉడాయించాడు. అనంతరం దాడి ఘటనపై ఏఎస్‌ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సీఐ మునిరాజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు సేకరించారు.
జబిఉల్లాపై చర్యలు తీసుకుంటామ ఏఎస్‌ఐకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏఎస్‌ఐపైకి దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలనాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు.