తమిళనాడులో ఘోర రోడ్డు ప‍్రమాదం | Car hits container in tamilnadu, 6killed | Sakshi
Sakshi News home page

కంటైనర్ను ఢీకొన్న కారు, ఆరుగురు మృతి

Nov 14 2016 9:26 AM | Updated on Sep 4 2017 8:05 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప‍్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప‍్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా...

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విల్లుపురం జిల్లా ఆచనూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులంతా చెన్నై వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement