చంపి..అవయవాలు వేరుచేసి.. | brutal murder of two years old girl in mysore | Sakshi
Sakshi News home page

చంపి..అవయవాలు వేరుచేసి..

Oct 22 2016 3:24 AM | Updated on Sep 4 2017 5:54 PM

రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు

మైసూరు(కర్ణాటక): రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, కాలు, చేయి వేరు చేసి చెత్తకుప్పల్లో పడేసి వెళ్లిన ఉదంతం గురువారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని గాంధీనగర సమీపంలో కుక్కలు కుళ్లిన మానవ అవయవాలను పీక్కుతింటూంటుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లు గుర్తించారు. బాలుడా లేక బాలికా అనేది కూడా గుర్తు పట్టని విధంగా కత్తులతో పొడిచినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అనంతరం అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కేఆర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement