'బ్రూ' మా అభిమాన కాఫీ | 'Bru' is our favorite coffee | Sakshi
Sakshi News home page

'బ్రూ' మా అభిమాన కాఫీ

Jun 15 2016 2:16 AM | Updated on Oct 30 2018 5:58 PM

'బ్రూ' మా అభిమాన కాఫీ - Sakshi

'బ్రూ' మా అభిమాన కాఫీ

బ్రూ ఇన్‌స్టెంట్ తమ అభిమాన కాఫీ అని ఆ బ్రాండ్ అంబాసిడర్లు, సినీ తారలు కార్తి, కాజల్ తెలిపారు.

* బ్రాండ్ అంబాసిడర్లు కార్తి, కాజల్
* అభిమానులతో సందడి

టీనగర్: బ్రూ ఇన్‌స్టెంట్ తమ అభిమాన కాఫీ అని ఆ బ్రాండ్ అంబాసిడర్లు, సినీ తారలు కార్తి, కాజల్  తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులతో మంగళవారం ఓ వినూత్న అనుభూతిని సొంతం చేసుకున్నారు. బ్రూ అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘మీట్ కార్తి-కాజల్’ పోటీని ఏర్పాటుచేసి బహుమతిని ప్రకటించింది. ఇందులో ఒక లక్షకు పైగా వచ్చిన ఎంట్రీలలో విజేతను ఎంపిక చేసి వారికి ప్రఖ్యాత సెలబ్రిటీలు కార్తి, కాజల్ వద్ద నుంచి బహుమతిని అందజేశారు.

ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బ్రూ ఇన్‌స్టెంట్ బ్రాండ్ అంబాసిడర్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ బ్రూ ఇన్‌స్టెంట్ తనకు ఎంతో అభిమానమైన కాఫీ అని, ఈ బ్రాండ్‌తో అనుబంధం కుదుర్చుకోవడం థ్రిల్‌కు గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా అభిమానులను కలుసుకోవడం సంతోషంగా వుందన్నారు. ఈ పోటీకి లభించిన అనూహ్య స్పందన చూస్తుంటే వారికి బ్రాండ్ పట్ల, తనపైన, తన చిత్రాలపై వున్న ప్రేమ వ్యక్తమవుతోందన్నారు.

బ్రూ ఇన్‌స్టెంట్ బ్రాండ్ అంబాసిడర్ కార్తి మాట్లాడుతూ ఇక్కడ అభిమానులతో గడపడం ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు ఏర్పాటు చేసిన ‘బ్రూ’కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.  ఈ కార్యక్రమంలో కాజల్, కార్తి బ్రూ ఇన్‌స్టెంట్ కాఫీ తయారుచేయగా, ఓ అభిమాని కాజల్ తయారు చేసిన కాఫీని రుచి చూసి ఉత్తమంగా ఉన్నట్లు మెచ్చుకున్నారు.

మీట్ కార్తి-కాజల్ పోటీలో గెలుపొందిన చెన్నై విజేత మహేశ్వరి మాట్లాడుతూ ఈ రోజు తన కల నెరవేరిందని, కార్తి, కాజల్ తనకు అభిమాన తారలని, ఈ సందర్భంగా వారిని కలుసుకునేందుకు అవకాశం కల్పించిన బ్రూకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బ్రూ ఇన్‌స్టెంట్ తనకెంతో అభిమానమైన కాఫీ అని, ఈ సందర్భంగా టీవీఎస్ జూపిటర్ స్కూటర్ అందుకోవడం ఆనందంగా వుందని, దీన్ని తన భర్తకు బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement