
హీరోయిన్ యోగా షోపై మరో వివాదం
గత నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి బిపాసాబసుకు ఫీజు విషయంపై మరో వివాదం చెలరేగింది.
గత నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను బాలీవుడ్ నటి బిపాసాబసుకు ఫీజు విషయంపై మరో వివాదం చెలరేగింది. కంఠీరవ స్టేడియంలో ప్రముఖ రాజకీయ నాయకులు, బిపాసా పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బిపాసాకు భారీ మొత్తం చెల్లించారని అప్పట్లో ఆరోపణలు, విమర్శులు వచ్చాయి.
కాగా బిపాసాకు డబ్బు చెల్లించే విషయంలో తాజాగా మరో వివాదం ఏర్పడింది. యోగా కార్యక్రమం నిర్వహించినందుకుగాను తమకు 45 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్వాహకులు కోరారు. అయితే, బిపాసాకు, కార్యక్రమ నిర్వాహకులకు భారీ మొత్తం చెల్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో బిపాసాకు ఎవరు డబ్బు చెల్లిస్తారన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.