నమ్మకాన్ని నూరిపోశాడా! | Bindu Madhavi in Sibi's Jackson Durai | Sakshi
Sakshi News home page

నమ్మకాన్ని నూరిపోశాడా!

Jun 23 2015 2:53 AM | Updated on Sep 3 2017 4:11 AM

నమ్మకాన్ని నూరిపోశాడా!

నమ్మకాన్ని నూరిపోశాడా!

విజయం ఎండమావిగా మారితే నిరాశ, నిస్ఫృహలు చుట్టుముట్టడం సహజం. నటి బిందుమాధవి పరిస్థితి ఇంచుమిం చు అలాంటిదే.

 విజయం ఎండమావిగా మారితే నిరాశ, నిస్ఫృహలు చుట్టుముట్టడం సహజం. నటి బిందుమాధవి పరిస్థితి ఇంచుమిం చు అలాంటిదే. ఈ తెలుగమ్మాయికి తెలుగు మార్కెట్  కన్నా తమిళంలో కాస్త బెటర్ అనుకున్నా ఇక్కడా ఆమె విజయం కోసం చకోరి పక్షిలా ఎదురు చూసున్నారన్నది నిజం. తొలి రోజల్లో కళుగు, కేడిబిల్లా కిల్లాడిరంగా, దేసింగ్ రాజా వంటి చిత్రాలు బిందుమాధవికి విజయానందాన్నిచ్చినా ఆ తరువాత అవి ముఖం చాటేశాయనే చెప్పాలి. అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అలాంటి సమయంలో పాండిరాజ్ దర్శకత్వంలో హైకూ చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరుమాట లేకుండా ఒప్పేసుకుంది.
 
 అయితే అది పసంగ, మెరీనా వంటి బాలల ఇతి వృత్తంతో రూపొందుతున్న చిత్రం కావడం నటుడు సూర్య, అమలాపాల్ లు అతిథి పాత్రల్లో నటించడంతో ఆ చిత్రం తన కేరీర్‌కు ఏమాత్రం హెల్ప్ అవుతుందోనన్న సందిగ్ధంలో పడ్డ బిందుమాధవికి తాజాగా సిబి రాజ్‌తో జాక్సన్ దురై చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. నాయ్‌గళ్ జాగ్రతై చిత్రంతో హిట్‌ను అందుకున్నా అంతకు ముందు సిబి రాజ్‌కు సరైన విజయం లేదన్నది గమనార్హం. దీంతో ఆయనతో నటిస్తున్న జాక్సన్ దురై విజయతీరం చేరుకుంటుందా అన్న అనుమానం బిందుమాధవిని పట్టి పీడిస్తోందట.
 
  ఆమె చింతను పసిగట్టారో ఏమో గానీ జక్సన్ దురై చిత్ర షూటింగ్ సెట్‌లో కూర్చున్న బిందుమాధవితో ఈ చిత్రం సాధారణ దెయ్యం కథా చిత్రం కాదు హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రూపొందుతున్న చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని ధైర్యాన్ని నూరిపోశారట. మరి బిందు మాధవి ఎంత వరకు కన్వెన్స్ అయిందో గానీ ప్రస్తుతం ఆమె ఆశలన్నీ హైకూ, జాక్సన్ దురై చిత్రాలపైనే పెట్టుకుందన్నది నిజం.
 

Advertisement
 
Advertisement
Advertisement