breaking news
Directed pandiraj
-
నమ్మకాన్ని నూరిపోశాడా!
విజయం ఎండమావిగా మారితే నిరాశ, నిస్ఫృహలు చుట్టుముట్టడం సహజం. నటి బిందుమాధవి పరిస్థితి ఇంచుమిం చు అలాంటిదే. ఈ తెలుగమ్మాయికి తెలుగు మార్కెట్ కన్నా తమిళంలో కాస్త బెటర్ అనుకున్నా ఇక్కడా ఆమె విజయం కోసం చకోరి పక్షిలా ఎదురు చూసున్నారన్నది నిజం. తొలి రోజల్లో కళుగు, కేడిబిల్లా కిల్లాడిరంగా, దేసింగ్ రాజా వంటి చిత్రాలు బిందుమాధవికి విజయానందాన్నిచ్చినా ఆ తరువాత అవి ముఖం చాటేశాయనే చెప్పాలి. అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అలాంటి సమయంలో పాండిరాజ్ దర్శకత్వంలో హైకూ చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరుమాట లేకుండా ఒప్పేసుకుంది. అయితే అది పసంగ, మెరీనా వంటి బాలల ఇతి వృత్తంతో రూపొందుతున్న చిత్రం కావడం నటుడు సూర్య, అమలాపాల్ లు అతిథి పాత్రల్లో నటించడంతో ఆ చిత్రం తన కేరీర్‌కు ఏమాత్రం హెల్ప్ అవుతుందోనన్న సందిగ్ధంలో పడ్డ బిందుమాధవికి తాజాగా సిబి రాజ్‌తో జాక్సన్ దురై చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. నాయ్‌గళ్ జాగ్రతై చిత్రంతో హిట్‌ను అందుకున్నా అంతకు ముందు సిబి రాజ్‌కు సరైన విజయం లేదన్నది గమనార్హం. దీంతో ఆయనతో నటిస్తున్న జాక్సన్ దురై విజయతీరం చేరుకుంటుందా అన్న అనుమానం బిందుమాధవిని పట్టి పీడిస్తోందట. ఆమె చింతను పసిగట్టారో ఏమో గానీ జక్సన్ దురై చిత్ర షూటింగ్ సెట్లో కూర్చున్న బిందుమాధవితో ఈ చిత్రం సాధారణ దెయ్యం కథా చిత్రం కాదు హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రూపొందుతున్న చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని ధైర్యాన్ని నూరిపోశారట. మరి బిందు మాధవి ఎంత వరకు కన్వెన్స్ అయిందో గానీ ప్రస్తుతం ఆమె ఆశలన్నీ హైకూ, జాక్సన్ దురై చిత్రాలపైనే పెట్టుకుందన్నది నిజం. -
విశాల్‌తో నటించే భామ ఏవరో?
నటుడు విశాల్ ఇటీవల నటుడిగా, నిర్మాతగా వేగం పెంచారు. అలాగే వరుసగా విజయాలు సాధిస్తున్నారు. పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై, ఆంబళ ఈ చిత్రాలన్నీ విశాల్‌కు విజయాలను అందించిన వే. ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో పాయుం పులిగా రాబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి రెండు చిత్రాలకు విశాల్ కమిట్ అయ్యారు. వాటిలో ఆయన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టగా సండకోళి చిత్రానికి సీక్వెల్, రెండవది పాండిరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రం ఈ రెండు చిత్రాల షూటింగ్ ఏకకాలంలో జరగనున్నాయనే ప్రచారం జరిగింది. అయితే సండైకోళి-2 చిత్రం నిర్మాణం వాయిదా పడిందని పాండిరాజ్ దర్శకత్వం వహించే చిత్ర షూటింగ్ త్వరలో మొదలవుతుందని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ వర్గాలు సమాచారం. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విశాల్‌తో నటించని హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతోందట. ఆ పట్టికలో నటి సమంత, నిత్యామీనన్ ముందున్నారని తెలిసింది. వీరిలో ఎవరు ఓకే అవుతారన్నది త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హిప్హాప్ తమిళం సంగీతాన్ని అందించనున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్ నటించిన ఆంబళ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.