హై డ్రామా! | Bhaskararavu, being an attempt to protect ahviinrao | Sakshi
Sakshi News home page

హై డ్రామా!

Jul 12 2015 8:48 AM | Updated on Sep 2 2018 4:37 PM

హై డ్రామా! - Sakshi

హై డ్రామా!

లోకాయుక్త సంస్థకున్న గౌరవ మర్యాదలను మంటగలిపిన న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు, ఆయన కుమారుడు అశ్విన్‌రావును రక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే విమర్శించారు.

- భాస్కరరావు, అశ్విన్‌రావును కాపాడే యత్నం సాగుతోంది
- కేసును సీబీఐకి అప్పగించకుండా ప్రభుత్వం నాటకాలాడుతోంది
- ప్రభుత్వంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే మండిపాటు

సాక్షి, బెంగళూరు:
లోకాయుక్త సంస్థకున్న గౌరవ మర్యాదలను మంటగలిపిన న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు, ఆయన కుమారుడు అశ్విన్‌రావును రక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే విమర్శించారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నాటకాలాడుతోందంటూ తీవ్రంగా మండిపడ్డా రు. ‘భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి’ ఆధ్వర్యంలో శనివారమిక్కడి శాసకర భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

లోకాయుక్త సంస్థ న్యాయమూర్తిగా పనిచేస్తున్న భాస్కర్‌రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(ఎస్‌ఐటీ)ను ఏర్పాటు చేసిందని, అయితే ఎస్‌ఐటీకి కేవలం ఫిర్యాదులు నమోదు చేసుకునే అధికారాన్ని మా త్రమే కల్పించిందని అన్నారు. కనీసం ఎఫ్‌ఐర్ నమో దు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు కూడా చేయలేని సందర్భంలో ఇక ఎస్‌ఐటీని ఏర్పాటు చేసి ఏం లాభం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు అవినీతికి పాల్పడకపోయి ఉండవచ్చని, అయితే ఆయన కుమారుడు అశ్విన్‌రావు మాత్రం లోకాయుక్త పేరు చెప్పుకునే అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు.

అందువల్ల ఇందుకు నైతిక బా ద్యత వహిస్తూ లోకాయుక్త స్థానానికి భాస్కరరావు రాజీనామా చేయాల్సి ఉందని అన్నారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించే అధికారాలు తమకు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ సంతోష్ హెగ్డే విమర్శించారు. లోకాయుక్త విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంతోష్‌హెగ్డే పేర్కొన్నారు. అనంతరం భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి ఎ.టి.రామస్వామి మాట్లాడుతూ....లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును ఆ పదవి నుంచి తప్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం శోచనీయమని అన్నా రు.
 
ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కూ డా లోకాయుక్త ప్రతిష్టను మరింత దిగజార్చేలా పదవిని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డారు. లోకాయుక్త సంస్థ ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement