'మౌనంగా' ఉండమని శాసించారు | Bengaluru voters have elected the corrupt candidates in bbmp elections, says kumaraswamy | Sakshi
Sakshi News home page

'మౌనంగా' ఉండమని శాసించారు

Aug 26 2015 9:44 AM | Updated on Sep 3 2017 8:10 AM

'మౌనంగా' ఉండమని శాసించారు

'మౌనంగా' ఉండమని శాసించారు

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో జేడీఎస్ తీవ్ర పరాభవంపై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో జేడీఎస్ తీవ్ర పరాభవంపై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తాము బెంగళూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని భావిస్తే ఓటర్లు మాత్రం అందుకు స్పందించలేదని అన్నారు.

ఓటమి అనంతరం ఆయన 'బీబీఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే విషయం కంటే బెంగళూరు నగరానికి మరోసారి అపాయం ఎదురవుతోందని మాత్రం చెప్పవచ్చు. ఈ ఫలితాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడరాదు, చెరువులు, భూములను కబ్జా చేసిన వారిపై పోరాటం చేయకూడదు. ఇంకా వీలైతే ఇలాంటి వాళ్లతో మీరూ (జేడీఎస్) కలిసిపోండి, అది చేతకాకపోతే మౌనంగా ఉండిపోండి' అని ప్రజలు తమ తీర్పులో స్పష్టంగా చెప్పారు' అని కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement