వాట‍్సప్‌లో నీలి చిత్రాలు పంపిన ఎమ్మెల్సీ | Belagavi MLC posts porn photos to WhatsApp group | Sakshi
Sakshi News home page

వాట‍్సప్‌లో నీలి చిత్రాలు పంపిన ఎమ్మెల్సీ

May 3 2017 10:45 AM | Updated on Sep 18 2018 8:00 PM

వాట‍్సప్‌లో నీలి చిత్రాలు పంపిన ఎమ్మెల్సీ - Sakshi

వాట‍్సప్‌లో నీలి చిత్రాలు పంపిన ఎమ్మెల్సీ

ఒక ప్రజాప్రతినిధి వాట్సప్‌ గ్రూప్‌లో విచ్చలవిడిగా బూతు చిత్రాలను పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

బెంగళూరు (బెళగావి): కర్ణాటకలో ఒక ప్రజాప్రతినిధి వాట్సప్‌ గ్రూప్‌లో విచ్చలవిడిగా బూతు చిత్రాలను పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది. బెళగావి నగరంలో ఉన్న బెల్గాం మీడియా ఫోర్స్‌ అనే వాట్సప్‌ గ్రూప్‌లో సభ్యుడైన స్థానిక బీజేపీ ఎమ్మెల్సీ మహంతేష్‌ కవటిమఠ తన మొబైల్‌ఫోన్‌ నుంచి నీలిచిత్రాలను పంపించిన ఘటన వెలుగు చూసింది.

ఇతని మొబైల్‌ వాట్సప్‌ ఖాతా నుంచి సుమారు 50కి పైగా నీలి చిత్రాలు ఒక గ్రూప్‌లోకి వెళ్ళినట్లు సమాచారం. గ్రూప్‌లో బెళగావికి చెందిన ప్రముఖ నాయకులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు నగర ప్రముఖులు కూడా ఉన్నారు. అశ్లీల చిత్రాలను గ్రూప్‌లో పోస్ట్‌ చేసినప్పటి నుంచి ఆ ఎమ్మెల్సీ మొబైల్‌ ఫోన్‌ను స్విచాఫ్‌ చేసినట్లు నగర మీడియా ప్రతినిదులు తెలిపారు. ఎమ్మెల్సీ ఘనకార్యంపై గ్రూప్‌ సభ్యులు, ప్రజలు  మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement