సాక్షి, న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోగల సంకటహరణ గణపతి ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదిరోజులపాటు జరగనున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలతోపాటు ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు చేస్తున్నారు. ప్రతి రోజూ భక్తులతో శ్రీలలితా సహస్ర పారాయణం చేస్తున్నారు.
ఘనంగా విలక్కు పూజ
Oct 7 2013 12:06 AM | Updated on Sep 1 2017 11:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోగల సంకటహరణ గణపతి ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదిరోజులపాటు జరగనున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలతోపాటు ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు చేస్తున్నారు. ప్రతి రోజూ భక్తులతో శ్రీలలితా సహస్ర పారాయణం చేస్తున్నారు.
ఆదివారం నిర్వహించిన విలక్కు (దీప) పూజలో వసుంధర ఎన్‌క్లేవ్, నోయిడా, ఇంద్రపురం, గాజీపుర్, వైశాలితోపాటు ఇతర ప్రాంతాల నుంచి రెండు వందల మంది మహిళలు పాల్గొననున్నట్టు సంకటహరణ గణపతి ఆలయ ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ తెలిపారు. ఎప్పటిమాదిరిగానే ఆలయ ప్రాంగణంలో దాదాపు వంద దేవతామూర్తుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశారు. 13వ తేదీన సరస్వతీ పూజ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ పూజాకమిటీ ఆధ్వర్యంలో చేపడతారు.
Advertisement
Advertisement