పాక్ వైఖరిని ఎండగట్టాలి: రఘువీరా
ఉగ్రమూకలపై భారత సైన్యం మెరుపుదాడులు చేయడం అభినందనీయమని ఏపీపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు.
విజయవాడ: ఉగ్రమూకలపై భారత సైన్యం మెరుపుదాడులు చేయడం అభినందనీయమని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి.. సైనిక దాడి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ప్రకటించాలన్నారు. యావత్ భారతదేశం సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
సైనికులకు మద్ధతుగా శనివారం విశాఖలో ఏపీసీసీ ఆధ్వర్యంలో జై జవాన్-జై భారత్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లితే సమర్ధంగా తిప్పికొడతామని మన సైనికులు నిరూపించారన్నారు. పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. సైనికులకు మద్ధతుగా ర్యాలీలో ప్రజలు, యువకులు పాల్గొని విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.