అనుష్క వర్సెస్ అనుష్క | Anushka v/s Anushka | Sakshi
Sakshi News home page

అనుష్క వర్సెస్ అనుష్క

Sep 27 2015 2:45 AM | Updated on Sep 3 2017 10:01 AM

అనుష్క వర్సెస్ అనుష్క

అనుష్క వర్సెస్ అనుష్క

అనుష్కతో అనుష్క ఢీకుంటున్నారు. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? అంతే మరి ఆ అందాల భామకు ఆమే పోటీ అవుతున్నారు.

అనుష్కతో అనుష్క ఢీకుంటున్నారు. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? అంతే మరి  ఆ అందాల భామకు ఆమే పోటీ అవుతున్నారు. ఇంకా అర్థం కావడం లేదా?ఈ యోగా సుందరి నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజు తెరపై సందడి చేయనున్నాయి. అనుష్క టైటిల్ రోల్‌లో నటించిన బ్రహ్మాండ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి అక్టోబర్ 9వ తేదీన విడుదల కానుంది. గుణశేఖర్ సృష్టికర్త అయిన ఈ చిత్రంలో అల్లుఅర్జున్, రాణా ముఖ్యపాత్రలు పోషించారు.
 
 ఈ చిత్రం కోసం అనుష్క పలు సాహసాలు చేశారు. కాగా ఆమె నటించిన మరో చిత్రం ఇంజి ఇడుప్పళగి. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించారు. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడం విశేషం. ఇందులో అనుష్క పాత్ర కీలకంగా నిలవనుంది. ఈ పాత్ర కోసం అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరిగి నటించారు. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో రూపొందడం. ఇంజి ఇడుప్పళగి తెలుగులో జీరో సైజ్ పేరుతో విడుదల కానుంది. అలా అనుష్క వర్సెస్ అనుష్క డీకొంటున్నారన్న మాట.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement