నేడు జవాన్ అనిల్ అంత్యక్రియలు | Anil Jawan cremated today | Sakshi
Sakshi News home page

నేడు జవాన్ అనిల్ అంత్యక్రియలు

Oct 19 2014 3:37 AM | Updated on Sep 2 2017 3:03 PM

దేశ సరిహద్దులో పాక్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో అమరుడైన బీఎస్‌ఎఫ్ జవాన్ అనిల్‌కుమార్‌రెడ్డి (31) అంత్య క్రియలు ఆదివారం జరగనున్నాయి.

కదిరి : దేశ సరిహద్దులో పాక్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో అమరుడైన బీఎస్‌ఎఫ్ జవాన్ అనిల్‌కుమార్‌రెడ్డి (31) అంత్య క్రియలు ఆదివారం జరగనున్నాయి. ఆయన స్వగ్రామం తలుపుల మండలం తూపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద అనిల్‌కుమార్‌రెడ్డి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు.

అనంతరం అక్కడి నుంచి కోల్‌కత్తా మీదుగా బెంగళూరుకు విమానంలో మృతదేహాన్ని తీసుకువచ్చి, రోడ్డు మార్గంగా స్వగ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అందిన సమాఆరం మేరకు శనివారం అర్ధరాత్రికి అనిల్ కుమార్‌రెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశముంది. కాగా, గ్రామంలో ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి భార్య అపర్ణ అన్నపానీయాలు లేకుండా భర్త మృతదేహం కోసం నిరీక్షిస్తోంది. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా శనివారం పరామర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement