బంగారం జోలికి వస్తే అంతే..! | Andhra Pradesh Cabinet discuss on Gold Restrictions | Sakshi
Sakshi News home page

బంగారం జోలికి వస్తే అంతే..!

Dec 1 2016 6:52 PM | Updated on Jul 23 2018 7:01 PM

బంగారం జోలికి వస్తే అంతే..! - Sakshi

బంగారం జోలికి వస్తే అంతే..!

బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.

అమరావతి: బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేంద్రం బంగారం జోలికి వస్తే మరింత ప్రతికూలత వస్తుందని మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం.

కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో దీనిపై చర్చించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని చంద్రబాబు లేవనెత్తాలని మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రం బంగారం జోలికి రాకుండా చూడాలని చంద్రబాబుకు మంత్రులు సలహాయిచ్చినట్టు సమాచారం.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement