breaking news
Gold Restrictions
-
మోదీకి మహిళల ఉసురు తగులుతుందని
-
‘బంగారం'పై ఆంక్షలు దారుణం: భూమన
-
‘బంగారంపై ఆంక్షలు దారుణం’
తిరుపతి: బంగారంపై ఆంక్షలు విధించడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల ఉసురు కచ్చితంగా తగులుతుందని పేర్కొన్నారు. అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. నోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుల ప్రాణాలు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
బంగారం జోలికి వస్తే అంతే..!
అమరావతి: బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేంద్రం బంగారం జోలికి వస్తే మరింత ప్రతికూలత వస్తుందని మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో దీనిపై చర్చించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని చంద్రబాబు లేవనెత్తాలని మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రం బంగారం జోలికి రాకుండా చూడాలని చంద్రబాబుకు మంత్రులు సలహాయిచ్చినట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దుతో నవంబర్ లో రాష్ట్రానికి రూ. 800 కోట్లు నష్టం వాటిల్లిందని కేబినెట్ కు చంద్రబాబు తెలిపారు. ఈ నెలలో రూ. 1500 నష్టం రావొచ్చని చెప్పారు. కాగా, కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళికృష్ణ మరణం పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. -
బంగారం జోలికి వస్తే అంతే..!