రాగి పాత్రకు అతీంద్రియ శక్తులంటూ మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టయింది.
ఈ క్రమంలో శుక్రవారం నెల్లూరుకు చెందిన కె.మల్లికార్జునకు అమ్మేందుకు హిందూపురంలోని ఓ లాడ్జీలో బేరం కుదుర్చుకొని తూముకుంట చెక్‌పోస్టు వద్ద లావాదేవీలు జరిపేందుకు వెళ్లారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఆంజినేయులు తమ సిబ్బందితో దాడి చేశారు. రాగి బిందెను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు.