అమ్మ-చిన్నమ్మ బంధంపై స్పందించిన నర్సు | Amma, Sasikala true companions, says nurse R Piramila Visagan | Sakshi
Sakshi News home page

అమ్మ-చిన్నమ్మ బంధంపై స్పందించిన నర్సు

Feb 12 2017 5:18 PM | Updated on Sep 5 2017 3:33 AM

అమ్మ-చిన్నమ్మ బంధంపై స్పందించిన నర్సు

అమ్మ-చిన్నమ్మ బంధంపై స్పందించిన నర్సు

జయలలిత, శశికళ మధ్య సత్సంబంధాలు ఉండేవని, ఒకరంటే మరొకరికి ఇష్టమని జయలలిత దగ్గర నర్సుగా పనిచేసిన పిరమిళ వీసాగన్ చెప్పారు.

చెన్నై: జయలలిత, శశికళ మధ్య సత్సంబంధాలు ఉండేవని, ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టమని, ఇద్దరూ ప్రాణస్నేహితులని జయలలిత దగ్గర నర్సుగా పనిచేసిన ప్రమీల చెప్పారు. జయలలిత మృతిపై చిన్నమ్మపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. 2001లో జయలలితకు వ్యక్తిగత నర్సుగా పనిచేసిన ప్రమీల ఆదివారం మీడియాతో మాట్లాడారు.

'2001లో అమ్మ దగ్గర నర్సుగా పనిచేశాను. ఆ సమయంలో జయలలిత వందలాది సార్లు శశికళను పిలిచేవారు. వారిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. రాజకీయంగా జయలలిత తీసుకునే నిర్ణయాలను శశికళ దగ్గర్నుంచి గమనించారు. అమ్మ ఎదుర్కొన్న సవాళ్లను, ఒత్తిడి దగ్గర నుంచి చూశారు. నిరంతరం ఆమె బాగోగులు చూసుకున్నారు. అమ్మ దగ్గర 34 ఏళ్ల పాటు శశికళ ఉన్నారు. జయలలిత మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ, శశికళపై కొందరు చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంకాదు. వారిద్దరి మధ్య అలా జరిగే అవకాశమే లేదు. చాలామంది నాయకులు రాజకీయ లబ్ధికోసం మాటలు మారుస్తున్నారు. వారందరూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అమ్మ వారసత్వాన్ని కొనసాగించే సత్తా ఆమెకు మాత్రమే ఉంది' అని ప్రమీల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement