డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా కోర్సులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
నాగార్జున వర్సిటీలో దూరవిద్య కోర్సులు
Feb 6 2017 11:12 AM | Updated on Sep 5 2017 3:03 AM
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కో-ఆర్టినేటర్ వై జయపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 2017లో జరిగే వార్షిక పరీక్షలు రాయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, బీయస్సీ, బీకామ్, బీఏ, బ్యాచ్‌లర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరదల్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98491 44925, 99599 74064 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement