వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Dec 29 2023 1:46 AM | Updated on Dec 29 2023 8:36 AM

- - Sakshi

బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్‌, నాయకుడు పి.రాజ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్‌ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్‌ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు

Advertisement
 
Advertisement
Advertisement