సీనియర్‌ అకౌంటెంట్‌ బుక్కయ్యాడు | ACB caught Senior Accountant for taking Bribe | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అకౌంటెంట్‌ బుక్కయ్యాడు

Jan 4 2017 5:44 PM | Updated on Aug 17 2018 12:56 PM

సీనియర్‌ అకౌంటెంట్‌ బుక్కయ్యాడు - Sakshi

సీనియర్‌ అకౌంటెంట్‌ బుక్కయ్యాడు

కలెక్టరేట్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ట్రెజరీ విభాగంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్‌, రూ.6 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

వివరాలు.. పెందుర్తి కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న యూవీఎన్‌ శర్మకు జీతం బిల్లు చెల్లించేందుకు శ్రీనివాస్‌ లంచం డిమాండ్‌ చేశాడు. ఈ విషయాన్ని జూనియర్‌ లెక్చరర్‌ ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం కలెక్టరేట్‌ ఆఫీసులోనే శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement