మార్చిలో జరగనున్న సమావేశాల్లో రూ. 1.75లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ....
బెంగళూరు : మార్చిలో జ రగనున్న సమావేశాల్లో రూ. 1.75లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అన్ని విభాగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చే కూర్చే విధంగా అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని చె ప్పారు.
బెళగావి పర్యటనలో భా గంగా శనివారం ఉదయం సాం బ్రా విమానాశ్రయానికి చేరుకు న్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇక ఇటీవల వినిపిస్తున్న ‘దళిత సీఎం’ డి మాండ్‌పై సిద్దరామయ్య స్పంది స్తూ...తమ పార్టీలో దళిత సీఎం, మరో వర్గపు సీఎం అంటూ విభేదాలు లేవని అన్నారు. అందువల్ల దళిత సీఎం అన్న డిమాండ్ పార్టీలో తలెత్తే అవకాశమే లేదని పేర్కొన్నారు.