ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్‌ | 40kg of plastic and other waste found from stomach of cow | Sakshi
Sakshi News home page

ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్‌

Apr 26 2017 3:32 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్‌ - Sakshi

ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్‌

ఆవు కడుపులోంచి 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను వైద్యులు బయటకు తీశారు.

నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆవు కడుపులోంచి 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను వైద్యులు బయటకు తీశారు. స్థానిక ఎల్లమ్మ గుట్టకు చెందిన న్యాలం భాస్కర్ అనే రైతుకు చెందిన ఆవు కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఆహారం కూడా తీసుకోవటం లేదు. వెటర్నరీ డాక్టర్ రాజేష్ ను సంప్రదించగా పొట్టలో ప్లాసిక్ కవర్లను గుర్తించారు. దీంతో రైతు అంగీకరించటంతో బుధవారం ఆపరేషన్ చేసి దాదాపు 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను బయటకు తీసి ఆ మూగజీవి ప్రాణాలు కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement