వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్యాస్‌సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు
Nov 11 2016 2:12 PM | Updated on Mar 28 2018 11:26 AM
	శంషాబాద్ రూరల్: వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంసాబాద్ రూరల్ మండలం పెద్దతూప్రలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో అతని భార్య లక్ష్మమ్మ వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో సత్తయ్య, లక్ష్మమ్మలతో పాటు నర్సింహ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
