ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు | 3 injured in blast at oxford school | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు

Nov 30 2016 11:02 AM | Updated on Apr 3 2019 3:52 PM

ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు - Sakshi

ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు

ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు సంభవించింది.

ఒంగోలు: ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలులోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఆవరణలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులు నిలిపే ప్రదేశంలో పేలుడు సంభవించడంతో.. బస్సు డ్రైవర్, క్లీనర్, స్కూల్ వాచ్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పాఠశాల యాజమాన్యం క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సులోనే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement