మనసున్న యువతి | 3 feet young man love marriage | Sakshi
Sakshi News home page

మనసున్న యువతి

Nov 5 2017 4:12 PM | Updated on Aug 1 2018 2:29 PM

3 feet young man love marriage - Sakshi

అన్నానగర్‌: ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకొవాలనుకుంది ఆ యువ తి. ఎత్తు తక్కువని వద్దన్నారు ఆ యువతి తల్లిదండ్రులు. తమ ప్రేమకు ఇదేమి అడ్డంకి కాదని అతడినే పెళ్లాడింది ఆ యువతి. ఈ ఘటన అరంతాగి సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. పుదుకోట జిల్లా, అరంతాగి సమీపం, నెయ్‌వత్తలికి చెందిన సోయన్‌ కుమారుడు బాబు(28). ఇతను 3అడుగులు ఎత్తు ఉండి, ఎంఏ, బీఎడ్‌ చదివాడు. ప్రస్తుతం ఆవణం– కైకాట్టులో జిరాక్స్‌ దుకాణం నడుపుతున్నాడు. ఇతను కుళమంగళానికి చెందిన షణ్ముగం కుమార్తె ప్రియ(26) కొన్ని ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియ ఎంఎస్సీ, బీఎడ్‌ చదివింది. వీరి ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలియగా ప్రియ ఇంట్లో వారు వ్యతిరేకించారు. వారిని సమాధాన పరచాలని ప్రియ ప్రయత్నించినా వారు మారలేదు. దీంతో శుక్రవారం నెయ్‌వత్తలి ముత్తుమారియమ్మన్‌ ఆలయంలో బాబు, ప్రియ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో బాబు కుటుంబీకుల సమక్షంలో జరిగింది.   

Advertisement
 
Advertisement
Advertisement