హాంకాంగ్ విజయలక్ష్యం 159 | Zimbabwe set target of 159 runs for hong kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్ విజయలక్ష్యం 159

Mar 8 2016 4:38 PM | Updated on Sep 3 2017 7:16 PM

హాంకాంగ్ విజయలక్ష్యం 159

హాంకాంగ్ విజయలక్ష్యం 159

వరల్డ్ టీ 20లో భాగంగా హాంకాంగ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో జింబాబ్వే 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

నాగ్ పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా హాంకాంగ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో జింబాబ్వే 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన హాంకాంగ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే బ్యాటింగ్ చేపట్టింది. జింబాబ్వే కెప్టెన్ హమిల్టన్ మసకద్జ(20;13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడే యత్నంలో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం ముతుంబామి డకౌట్ గా అవుట్ కావడంతో జింబాబ్వే 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.

 

ఆ తరుణంలో విసు సిబందా(59;46 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆపై మాల్కోమ్ వాలర్(26) ఫర్వాలేదనిపించగా, చివర్లో చిగుంబరా(30) బ్యాట్ ఝుళిపించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు నమోదు చేసింది.  హాంకాంగ్ బౌలర్లలో తన్వీర్ అఫ్జల్, ఐజాజ్ ఖాన్లకు తలో రెండు వికెట్లు లభించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement