జింబాబ్వే క్రికెటర్లు తమ బోర్డుపై తిరుగుబాటుకు దిగారు. తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో శనివారం పాకిస్థాన్‌తో జరగాల్సిన కీలక వన్డే ఆడేది లేదని అల్టిమేటం జారీ చేశారు.
హరారే: జింబాబ్వే క్రికెటర్లు తమ బోర్డుపై తిరుగుబాటుకు దిగారు. తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో శనివారం పాకిస్థాన్‌తో జరగాల్సిన కీలక వన్డే ఆడేది లేదని అల్టిమేటం జారీ చేశారు.
వాస్తవానికి జట్టు ఆటగాళ్లకు ఈనెల 28న బకాయిలు చెల్లిస్తామని, శుక్రవారం బ్యాంకు ఖాతాల్లో చూసుకోవచ్చని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇంతకుముందు ప్రకటించింది. అయినా తమ ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను బాయ్‌కాట్ చేశారు. పాక్‌తో సిరీస్‌కు ముందు ఆటగాళ్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఓ సంఘంగా ఏర్పడ్డారు.