యువీ ట్వీట్‌: మాజీ లవర్‌ రియాక్ట్‌ | Yuvraj Singh Post Of Thanking His Fans Reacted By Kim Sharma | Sakshi
Sakshi News home page

యువీ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌: కిమ్‌ రిప్లై

Jun 11 2020 4:56 PM | Updated on Jun 11 2020 5:05 PM

Yuvraj Singh Post Of Thanking His Fans Reacted By Kim Sharma - Sakshi

ముంబై : టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులతో పాటు తాజా, మాజీ క్రికెటర్లు అతడిని స్మరించుకున్నారు. అంతేకాకుండా ‘మిస్‌ యూ యూవీ’ అంటూ సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్ట్‌ చేశారు. దీంతో యువీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా తనను గుర్తుచేసుకున్న అభిమానులకు యువీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. (నాపై నమ్మకం కల్గించావు: యువీ)

‘డియర్‌ ఫ్యాన్స్‌ మీ ప్రేమకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్‌ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్‌పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి. అవసరంలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయండి’ అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అయింది. అయితే యువీ ఉద్వేగంగా చేసిన ఈ పోస్ట్‌పై అతడి మాజీ లవర్‌ కిమ్‌ శర్మ రియాక్ట్‌ అయ్యారు. ‘గేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అంటూ కామెంట్‌ చేశారు. కాగా, యువీ-కిమ్‌ల మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగిన విషయం తెలిసిందే. అయితే 2007లో వీరి లవ్‌స్టోరీకి ఫుల్‌స్టాప్‌ పడింది. (ట్రెండింగ్‌లో సిక్సర్ల ‘యువరాజు‌’)

తన భర్త అలీ పుంజానీతో కిమ్ ‌శర్మ

కిమ్‌తో పెళ్లికి యువీ తల్లి ఒప్పుకోలేదని, కిమ్‌ వ్యవహార శైలి నచ్చకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారనే వార్తలు వచ్చాయి. 2010లో కెన్యా వ్యాపారవేత్త అలీ పుంజానీని కిమ్‌ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో ‘అవును, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆమే నా ప్రేమ. అయితే, ఇప్పుడు ఆమెకు పెళ్లైంది. ఇప్పుడామె గురించి మాట్లాడటం సరికాదు’ అంటూ యువీ వ్యాఖ్యానించడం విశేషం. ఇక నాలుగేళ్ల కిందట హాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌ను యువీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక గతేడాది యువీ ఇచ్చిన రిటైర్మెంట్‌ పార్టీకి కిమ్‌ హాజరయ్యారు. అనంతరం యువీ, హజెల్‌ కీచ్‌ల జీవితాల్లో వెలుగులు నిండాలి అంటూ ట్వీట్‌ చేశారు. కిమ్‌ శర్మ తెలుగు అభిమానులకు సుపరిచితమే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.

❤️

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement