 
															సిక్సర్ తో సెంచరీ కొట్టిన యువీ
టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ రంజీట్రోఫీలో సత్తా చాటాడు.
	మొహాలి: టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ రంజీట్రోఫీలో సత్తా చాటాడు. గ్రూపు 'బి' లీగ్ లో గుజరాత్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఈ పంజాబ్ బ్యాట్స్ మన్ సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. సిక్సర్ తో సెంచరీ పూర్తి చేయడం విశేషం.  233 బంతుల్లో 187  పరుగులు చేసి అవుటయ్యాడు.
	
	పంజాబ్ 608 పరుగులకు ఆలౌటైంది.  గుజరాత్ పై పంజాబ్ కు 141 పరుగుల ఆధిక్యం దక్కింది. మనన్ వోహ్రా(104)  సెంచరీకి తోడు మనదీప్ సింగ్(63), కౌల్(74) అర్ధ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 467 పరుగులు చేసింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
