తొలి రౌండ్‌లోనే యూకీ ఓటమి  | Yuki lost in the first round | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే యూకీ ఓటమి 

Jun 12 2018 12:55 AM | Updated on Jun 12 2018 12:55 AM

Yuki lost in the first round - Sakshi

న్యూఢిల్లీ: లిబెమా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. నెదర్లాండ్స్‌లోని ఎస్‌–హెర్టోజెన్‌ బాష్‌ నగరంలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ 4–6, 1–6తో డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) చేతిలో పరాజయం పొందాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు.
 
మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 
మరోవైపు స్టుట్‌గార్ట్‌లో జరుగుతున్న మెర్సిడెస్‌ కప్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు. క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 6–3, 4–6, 6–3తో క్రిస్టియన్‌ హారిసన్‌ (అమెరికా)పై గెలుపొందాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement