సింగిల్స్‌లో భారత్‌ నుంచి 8 మంది | World Badminton Championship Bharat Eight | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌లో భారత్‌ నుంచి 8 మంది

Jul 23 2017 2:54 AM | Updated on Sep 26 2018 3:36 PM

వచ్చే నెలలో స్కాట్లాండ్‌లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌
న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్కాట్లాండ్‌లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్, సమీర్‌ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్‌ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో భారత్‌తోపాటు చైనా, జపాన్‌ దేశాలకు నాలుగేసి బెర్త్‌లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో చైనా, డెన్మార్క్, హాంకాంగ్‌ దేశాల నుంచి కూడా నలుగురేసి అర్హత సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement