సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాబబుల్స్ జాబితాను హెచ్‌సీఏ వెల్లడించింది.
జింఖానా, న్యూస్‌లైన్: సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాబబుల్స్ జాబితాను హెచ్‌సీఏ వెల్లడించింది. ఈ టోర్నీ వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనుంది. ఎంపికైన ఆటగాళ్లు సోమవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో హాజరు కావాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాబబుల్స్ జాబితా
డయానా డేవిడ్, స్రవంతి నాయుడు, షాలిని, మమత, కావ్య, అరుంధతి రెడ్డి, సునీతా ఆనంద్, స్నేహ, ప్రణీష, మౌనిక, శ్రావణి, గీత, లావణ్య, సింధూజ రెడ్డి, సౌమ్య, రేవతి, రాగశ్రీ, విద్య, హిమాని, రచన, ప్రణీతి రెడ్డి, పల్లవి, హర్ష, ఏక్త, సౌజన్య, రమ్య, వినయశ్రీ, సంగీత, అనన్య, కీర్తన.