దిగ్గజాల సమరం మొదలైంది.. | wimbledon open semifinal matches to be start | Sakshi
Sakshi News home page

దిగ్గజాల సమరం మొదలైంది..

Jul 10 2015 5:48 PM | Updated on Sep 3 2017 5:15 AM

దిగ్గజాల సమరం మొదలైంది..

దిగ్గజాల సమరం మొదలైంది..

టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దిగ్గజాల సమరం ఆరంభమైంది.

లండన్: టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దిగ్గజాల సమరం ఆరంభమైంది. వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ఆసక్తికర పోరు సాగుతోంది. టైటిల్ పోరులో టాప్-3 ఆటగాళ్లు రేసులో నిలిచారు. సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్, స్విస్ కెరటం రోజర్ ఫెదరర్, బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే సెమీస్ బెర్తు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించి రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్) మరో బెర్తు దక్కించుకున్నాడు. రెండు సెమీస్ మ్యాచ్లు హోరీహోరీగా సాగే అవకాశముంది.


తొలి సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్.. 21వ సీడ్ గాస్క్వెట్తో తలపడుతున్నాడు. ఈ పోరులో జొకోవిచ్ ఫేవరెట్గా కనిపిస్తున్నా, గాస్క్వెట్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరో మ్యాచ్లో ఏడుసార్లు వింబుల్డన్ చాంప్ ఫెదరర్, ముర్రే మధ్య అమీతుమీ తేల్చుకోనున్నారు. ముర్రేకు స్థానిక అభిమానుల మద్దతు లభించనుండటం కలసి వచ్చే అంశం. ఇక మహిళల డబుల్స్ సెమీస్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలో దిగింది. సానియా, మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్)తో కలసి అమెరికా జోడీ రాక్వెల్ జోన్స్, అబిగెయిల్ స్పియర్స్తో తలపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement