తొలి వన్డే కివీస్‌దే

Williamson, pacers star in easy New zealand win - Sakshi

వెల్లింగ్టన్‌: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కల్గించిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ 61 పరుగుల తేడాతో(డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం )విజయం సాధించింది.  కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ (115; 117 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌)  బాధ‍్యాతాయుత ఇన్నింగ్స్‌ ఆడగా, మున్రో(58;35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. వీరికి జతగా నికోలస్‌(50;43 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 30.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పాక్‌ ఆటగాళ్లలో ఫకర్‌ జామన్‌(82 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించలేదు. కాగా,  మరొకసారి భారీ వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో  ఆధిక్యంలో నిలిచిన కివీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం విజయం సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top