విండీస్ జట్టులో నరైన్కు చోటు | West Indies pick Narine in World T20 squad | Sakshi
Sakshi News home page

విండీస్ జట్టులో నరైన్కు చోటు

Jan 30 2016 5:38 PM | Updated on Sep 3 2017 4:38 PM

విండీస్ జట్టులో నరైన్కు చోటు

విండీస్ జట్టులో నరైన్కు చోటు

నుమానస్పద స్పిన్నర్ సునీల్ నరైన్కు త్వరలో భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ లో పాల్గొనే వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు లభించింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అనుమానస్పద స్పిన్నర్ సునీల్ నరైన్కు ట్వంటీ 20 వరల్డ్ కప్ లో పాల్గొనే వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు లభించింది. గతేడాది నవంబర్ లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అనుమానస్పద బౌలింగ్ శైలితో నరైన్ సస్పెండైన సంగతి తెలిసిందే. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ లో భాగంగా తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడనే ఫిర్యాదుతో అతన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)సస్పెండ్ చేసింది. అనంతరం దేశవాళీ లీగ్ ద్వారా నరైన్ బౌలింగ్ ను మెరుగుపర్చుకునేందుకు విండీస్ బోర్డు అవకాశం కల్పించి అతనికి అండగా నిలిచింది. కాగా, ట్వంటీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన నరైన్ మరోసారి తన బౌలింగ్ యాక్షన్ ను నిరూపించుకోవాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రకటించిన విండీస్ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కని, క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్లకు ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడే జట్టులో అవకాశం కల్పించారు. 2012లో ట్వంటీ 20 వరల్డ్ కప్ గెలిచిన విండీస్ జట్టులోని 11 మంది ఆటగాళ్లు మరోసారి అవకాశం దక్కడం విశేషం.  దీంతో పాటు విండీస్ టెస్టు, వన్డే కెప్టెన్ జాసన్ హోల్డర్ కు తొలిసారి వరల్డ్ ట్వంటీ 20 కప్ లో చోటు దక్కింది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 6 తేదీ వరకూ భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగనుంది. శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement