'వరల్డ్కప్ ను గెలిచే సత్తా ఉంది' | West Indies have all ingredients to regain World T20 title, Curtly Ambrose | Sakshi
Sakshi News home page

'వరల్డ్కప్ ను గెలిచే సత్తా ఉంది'

Mar 1 2016 5:29 PM | Updated on Sep 3 2017 6:46 PM

'వరల్డ్కప్ ను గెలిచే సత్తా ఉంది'

'వరల్డ్కప్ ను గెలిచే సత్తా ఉంది'

త్వరలో భారత్లో జరుగనున్న ట్వంటీ 20 వరల్డ్కప్ను సాధించడానికి వెస్టిండీస్కు అన్ని అర్హతలున్నాయని ఆ దేశ బౌలింగ్ కోచ్ కర్ట్లీ ఆంబ్రోస్ ధీమా వ్యక్తం చేశాడు.


ఆంటిగ్వా: త్వరలో భారత్లో జరుగనున్న ట్వంటీ 20 వరల్డ్కప్ను సాధించడానికి వెస్టిండీస్కు అన్ని అర్హతలున్నాయని ఆ దేశ బౌలింగ్ కోచ్ కర్ట్లీ ఆంబ్రోస్ ధీమా వ్యక్తం చేశాడు. అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లు తమ జట్టు సొంతమని ఈ సందర్భంగా ఆంబ్రోస్ గుర్తు చేశాడు. ఇప్పటికే దేశవాళీ ట్వంటీ 20 లీగ్ల్లో తమ ఆటగాళ్లు అంచనాలు మించి రాణిస్తున్నారని, అదే ఫామ్ను వరల్డ్ ట్వంటీ 20 వేదికపై కూడా కనబరస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

'మా జట్టును చూడండి.  దాదాపు సగం మంది  విండీస్  ఆటగాళ్లకు విదేశాల్లో జరిగే ట్వంటీ 20 లీగ్ల్లో మంచి డిమాండ్ ఉంది. కొంతమంది ఒకే లీగ్ లో వేర్వేరు జట్లుకు ఆడుతుండగా,  మరికొంతమంది మరో లీగ్లో కలిసి ఆడుతున్నారు. ఇది వెస్టిండీస్కు అడ్వాంటేజ్ అవుతుంది' అని ఆంబ్రోస్ తెలిపాడు. వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రస్సెల్, డారెన్ సమీలతో కూడిన  సీనియర్ ఆటగాళ్లుండటం  తమకు అదనపు బలమని ఆంబ్రోస్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement